America: అమెరికాలో మంచు తుఫాన్..! 1 d ago
భారీ మంచు తుఫాన్ అమెరికాలోని కాటన్వుడ్ కాన్యన్(యుటా), కాన్సాస్ సిటీ, మిస్సోరీ, కెంటకీ, వర్జీనియా, వెస్ట్ వర్జీనియా, అర్కాన్సాస్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తుండటంతో ఈ రాష్ట్రప్రభుత్వాలు ఎమర్జెన్సీని విధించాయి. ఈ తుఫాన్ కు బ్లెయిర్ మంచు తుఫాన్ అని పేరు పెట్టారు. గంటకు దాదాపు 5 నుంచి 15 అంగుళాల తీవ్రతతో మంచు కురుస్తుందని, ఈ మంచు తుఫాన్ గత దశాబ్ద కాలంలోనే అతి తీవ్ర శీతల తుఫానుగా మారనున్నట్లు నేషనల్ వెదర్ సర్వే అంచనా వేసింది. ఈ బ్లెయిర్ మంచు తుఫాన్ (పోలార్ వోర్టెక్స్) వల్ల దాదాపు 30 రాష్ట్రాల్లో మైనస్ లలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.పోలార్ వోర్టెక్స్, ఉత్తర, దక్షిణ ధ్రువాల వద్ద అల్పపీడనం మరియు చల్లని గాలులతో కూడిన పెద్ద ప్రాంతం(ఆర్కిటిక్, అంటార్కిటిక్ వలయాలు) వద్ద ఏర్పడుతుంది. దీనినే శీతాకాలపు తుఫాను, సర్కమ్ పోలార్ వోర్టెక్స్, పోలార్ పిగ్ అని కూడా పిలుస్తారు. పోలార్ వోర్టెక్స్ ఉత్తర ధ్రువంలో అపసవ్య దిశలో మరియు దక్షిణ ధ్రువంలో సవ్యదిశలో తిరుగుతుంది.